Chuttamalle


Imprimir canciónEnviar corrección de la canciónEnviar canción nuevafacebooktwitterwhatsapp

చుట్టమల్లె చుట్టేస్తాంది తుంటరి చూపు
ఊరికే ఉండదు కాసేపు
అస్తమానం నీ లోకమే నా మైమరపు
చేతనైతే నువ్వే నన్నాపు
రా నా నిద్దర కులాసా
నీ కలలకిచ్చేశా
నీ కోసం వయసు వాకిలి కాసా
రా నా ఆశలు పోగేశా
నీ గుండెకు అచ్చేశా
నీ రాకకు రంగం సిద్ధం చేశా

ఎందుకు పుట్టిందో పుట్టింది
ఏమో నువ్వంటే ముచ్చట పుట్టింది
పుడతానే నీ పిచ్చి పట్టింది
నీ పేరు పెట్టింది
వయ్యారం ఓణి కట్టింది
గోరింట పెట్టింది
సామికి మొక్కులు కట్టింది

చుట్టమల్లే చుట్టేస్తాంది
ఆ చుట్టేస్తాంది చుట్టమల్లే చుట్టేస్తాంది
ఆ అరె రె రె చుట్టమల్లే చుట్టేస్తాంది
తుంటరి చూపు ఊరికే ఉండదు కాసేపు

మత్తుగా మెలేసింది నీ వరాల మగసిరి
హత్తుకోలేవా మరి సరసన చేరీ
వాస్తుగా పెంచనిట్ఠా వందకోట్ల సొగసిరి
ఆస్తిగా అల్లేసుకో కొసరీ కొసరీ
చేయరా ముద్దుల దాడి ఇష్టమే నీ సందడీ
ముట్టడించి ముట్టేసుకోలేవా ఓ సారి చేజారీ

రా ఏ బంగరు నెక్లీసు నా ఒంటికి నచ్చట్లే
నీ కౌగిలితో నను శింగారించు
రా ఏ వెన్నెల జోలాలి నన్ను నిద్దర పుచ్చట్లే
నా తిప్పలు కొంచం ఆలోచించు
ఎందుకు పుట్టిందో పుట్టింది
ఏమో నువ్వంటే ముచ్చట పుట్టింది
పుడతానే నీ పిచ్చి పట్టింది
నీ పేరు పెట్టింది
వయ్యారం వోణి కట్టింది
గోరింట పెట్టింది
సామికి మొక్కులు కట్టింది

చుట్టమల్లే చుట్టేస్తాంది
ఆ చుట్టేస్తాంది చుట్టమల్లే చుట్టేస్తాంది
ఆ అరె రె రె చుట్టమల్లే చుట్టేస్తాంది
తుంటరి చూపు ఊరికే ఉండదు కాసేపు